twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుభశ్రీ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి: కమల్ హాసన్

    |

    23 ఏళ్ల టెకీ సుభశ్రీ విషాదాంత మరణం తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది. ఎవరో చేసిన తప్పుకు అన్యాయంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం ఎంతో మందిని బాధించింది. ఎఐఎడిఎంకె కార్యకర్త పెట్టిన అక్రమ బ్యానర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆమెపై పడటంతో లాఢీ ఢీ కొని శుభశ్రీ మరణించిన సంగతి తెలిసిందే. సుభశ్రీ కుటుంబాన్ని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పరామర్శించారు.

    కమల్ హాసన్ సుభశ్రీ తల్లిదండ్రులను ఓదార్చుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె కుటుంబాన్ని కలిసిన తరువాత, మక్కల్ నీదిమయం నాయకుడు విలేకరులతో మాట్లాడుతూ, "ఈ నేరానికి పాల్పడిన వారిని శిక్షించాలి, ఏం తప్పు చేసినా తప్పించుకోగలం అనే నమ్మకంతో ఉన్న వారికి తగిన గుణపాఠం చెప్పాలి." అన్నారు.

     Kamal Haasan visited techie Subhasris house

    అంతేకాకుండా, అక్రమ బ్యానర్లు లేదా హోర్డింగులను ఏర్పాటు చేయవద్దని తన కార్యకర్తలకు, అభిమానులకు సూచించినట్లు కమల్ హాసన్ వెల్లడించారు. బిగ్ బాస్ తమిళం రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నప్పుడు, కమల్ హాసన్ మాట్లాడుతూ... అధికారుల నుంచి అవసరమైన అనుమతి పొందిన తరువాత మాత్రమే షోకు సంబంధించిన ప్రమోషనల్ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

    ఎటువంటి ఫ్లెక్సీలు, బేనర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని తమిళ స్టార్లు సూర్య, విజయ్ తమ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. కాప్పన్ ప్రమోషనల్ ఈవెంటులో సూర్య మాట్లాడుతూ, "సినిమా విడుదలకు ముందు సెలబ్రేషన్లో భాగంగా కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఏమీ వద్దని నా అభిమానులను నేను వినయంగా కోరుతున్నాను. అలాంటివి ఏర్పాటు చేయడానికి బదులు పాఠశాలలకు విరాళాలు ఇవ్వడం, రక్తదానం లాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుందని సూచించారు. మరో వైపు విజయ్ నటించిన 'బిగిల్' మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 19 న జరగబోతున్న నేపథ్యంలో అభిమానులకు ఎటువంటి బ్యానర్లు పెట్టవద్దని సూచించారు.

    English summary
    Kamal Haasan recently visited Subhasri's house to offer condolences to her parents. Subhasri died a tragic death when a lorry ran over her. The accident occurred when an illegal banner put up by an AIADMK functionary fell on her while driving.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X