twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఓటమికి అలాంటి కుట్ర.. కలుపు మొక్కల్ని ఏరేస్తా.. కమల్ హాసన్ ఫైర్

    |

    విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయాం అధినేత కమల్ హాసన్‌ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పార్టీలోని కలుపు మొక్కల్ని ఏరిపారేసేందుకు నాకు ఎలాంటి మొహమాటం లేదని, తప్పు చేసే వారిని, పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరకంగా పనిచేసే వాళ్లను శిక్షించడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఓ ప్రకటన జవారీ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...

    ఒక్క సీటు గెలవకపోయినా...

    ఒక్క సీటు గెలవకపోయినా...


    ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మైయాం పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. దక్షిణ కోయంబత్తూరు నుంచి కూడా కమల్ కూడా స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఓటమి నుంచి తేరుకొని పార్టీని మరో లెవెల్‌కు తీసుకు వెళ్తానని తాజా ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు.

    పేదల సంక్షేమం కోసమే..

    పేదల సంక్షేమం కోసమే..

    నా పార్టీ ఎజెండాను, నా అభిప్రాయాలను గౌరవించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. కలుషితమైన ప్రస్తుత రాజకీయాల్లోని ఇతర పార్టీలకు విరుద్దంగా, విభిన్నంగా మక్కల్ నీది మైయాం పార్టీని ఏర్పాటు చేశాను. పేద ప్రజల సంక్షేమమే నా పార్టీ సిద్దాంతం. దాని కోసం కట్టుబడి ఉంటాం, అందుకు ఎంత వరకైనా వెళ్తాను. పార్టీలో యువకులకు, మహిళలకు పెద్ద పీట వేస్తాం అని కమల్ హాసన్ అన్నారు.

    నా ఓటమికి రకరకాల కుట్రలు

    నా ఓటమికి రకరకాల కుట్రలు

    దక్షిణ కోయంబత్తూరులో పోటీ చేసిన సమయంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఖర్చు పెట్టిన ప్రతీ పైసా నా కష్టార్జితమే. ప్రత్యర్థి పార్టీలు విజయం కోసం అడ్డమైన దారులన్నీ తొక్కారు. అయినా నాపై విశ్వాసం ఉంచిన ప్రజలు ఆ నియోజకవర్గంలో 33 శాతం మంది ఓట్లు వేశారు. దానిని బట్టి మక్కల్ నీది మైయాం పార్టీకి ఘనంగా ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్పుకోవచ్చు. మరో 2 వేల మంది ఓట్లు వేసి ఉంటే తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించే వాళ్లం అని కమల్ హాసన్ పేర్కొన్నారు.

    నీతిమంతమైన రాజకీయాల కోసం

    నీతిమంతమైన రాజకీయాల కోసం

    ఇక నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పద్దతులను, విధానాలను పాటిస్తాం. నీతిమయమైన రాజకీయాల కోసం పోరాటం చేద్దాం. పార్టీ పున: నిర్మాణం కోసం పాటుపడుదాం. విజయం అనేది ఓ మాట కాదు.. సాధన, నిరంతర కృషి వల్లే సాధ్యం అవుతుంది. కుట్రలు, తాజా పరిస్థితులు, కొందరి ఆరోపణలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను మార్చలేం. పార్టీపై బురద జల్లేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం అని కమల్ హాసన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    Recommended Video

    Sonu Sood To Import Oxygen Plant From France | ఇంకో పది రోజుల్లో వస్తుంది || Filmibeat Telugu
    ఎన్నికల తర్వాత పార్టీలో కొత్త ఉత్తేజం

    ఎన్నికల తర్వాత పార్టీలో కొత్త ఉత్తేజం

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో ఉత్సాహం కనబడుతున్నది. ఓటమి తర్వాత కూడా కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారు. పొల్లాచ్చిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాం. అలాగే తూతుకూడి ప్రాంతంలొ కొత్త పార్టీ ఆఫీస్‌ను నిర్మిస్తున్నాం అని కమల్ హాసన్ తెలిపారు. పార్టీ బలపేతానికి కృషి చేస్తున్న వారందరికీ ధన్యావాదాలు అంటూ కమల్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

    English summary
    Actor turned Politician Kamal Haasan has warned wrongdoers in Party after defeat at Coimbatore. He released a statment that, There is currently no need to respond to criticism. Let's find out what percentage of those reviews are true and continue our journey without any lies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X