హైదరాబాద్‌లో కళ్ళు చెదిరేలా భారతీయుడు2.. సంచలన నిర్ణయం దిశగా కమల్ హాసన్!
దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 2.0 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన స్థాయిలో 2.0 చిత్రానికి స్పందన లభించడం లేదు. ఇదిలా ఉండగా శంకర్ మరో భారీ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. త్వరలో శంకర్, కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్ లో భారతీయుడు 2 చిత్రం ప్రారంభం కాబోతోంది. సమాజంలో జరిగుతున కొన్ని సంఘటనల ఆధారంగా బలమైన కథ రూపొందించినట్లు శంకర్ ఇటీవల తెలిపారు.

భారీ విలేజ్ సెట్
భారతీయుడు 2 షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుండడం విశేషం. భారతీయుడు 2 కోసం హైదరాబాద్ లో భారీ స్థాయిలో విలేజ్ సెట్ నిర్మిస్తున్నారు. కళ్ళు చెదిరేలా ఈ విలేజ్ సెట్ ఉండబోతోంది. శంకర్ చిత్రాల్లో సెట్ వర్క్ చాలా సహజంగా అనిపిస్తుంది. భారతీయుడు 2 కోసం అలాంటి జాగ్రత్తలే తీసుకోనున్నారు. డిసెంబర్ 14 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంచలన నిర్ణయం దిశగా
లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా ఉన్నత స్థాయికి చేరారు. నటనలో కమల్ చేయని ప్రయోగం అంటూ లేదు. ఇటీవల కమల్ హాసన్ రాజకీయాలపై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. కమల్ రాజకీయాల్లోకి ప్రవేశించి సొంతంగా పార్టీ కూడా స్థాపించారు. కానీ పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు. ఇటీవల కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కమల్ భారతీయుడు 2 తన చివరి చిత్రం అని అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాలిటిక్స్‌పై ఫోకస్
పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టడానికి సమయం కేటాయించాలి. భారతీయుడు2 తన చివరి చిత్రం కావచ్చేమో అని కమల్ వ్యాఖ్యానించారు. కానీ కమల్ అభిమానులు మాత్రం ఆయన నటన కొనసాగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారతీయుడు 2 కాకుండా కమల్ మరికొన్ని చిత్రాలకు కమిటై ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి కమల్ ఇప్పట్లో తప్పుకోరనే వాదన వినిపిస్తోంది.

కాజల్ అగర్వాల్
భారతీయుడు 2 చిత్రంలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ విభిన్నమైన లుక్ లో కనిపించనుంది. ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు ప్రభావితమై భారతీయుడు 2 కథ సిద్ధం చేశానని శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇటీవల కమల్ హాసన్ కు లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.


Click it and Unblock the Notifications











