ఇదేమి శంకర్ సినిమా బడ్జెట్టు కాదు. కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించబోతున్న మర్మయోగి సినిమా బడ్జెట్టు. ఈ 120 కోట్ల సినిమాలో అసిన్, హేమమాలిని ప్రధాన స్త్రీ పాత్రలు పోషించబోతున్నారట. ఏ.ఆర్.రహమాన్ దీనికి సంగీత దర్శకత్వం వహిస్తారుట. వాల్ట్ డిస్నీ వారు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భారత్ బాల ప్రొడక్షన్స్ వారితో కలిసి నిర్మిస్తారుట. తెలుగు, తమిళ, మళయాళీ, హిందీ భాషల్లో మొదట రిలీజ్ చేస్తారట. యేడవ శతాబ్దంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతుందిట. ఇంకా బయిటకు రాని చాలా ఆకర్షణలు ఈ సినిమాలో కనిపిస్తాయిట. కమల్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారట. స్కిప్టు వర్కు జరుగుతోందిట. కొంత మంది మన తెలుగు తారలకు కూడా తన సినిమాలో అవకాశమిచ్చే యోచనలో ఉన్నాడట. యేది ఎలా ఉన్నా కమల్ గత ప్రాజెక్టు మరుదనాయకన్ సినిమాలా ఈ సినిమాకూడా ఫ్రారంభ దశలోనే ఆగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. అయినా 'దశావతారం' రిలీజు అయి రిజల్ట్ వస్తే అంచనాలు అవకాశాలు మారుతాయి. 120 కోట్ల సౌతిండియన్ సినిమా సంగతి సరే గాని రెగ్యులర్ గా కమల్ సినిమాల్లో కనపడే ముద్దు సీనులో పెదాలు పంచుకునేది ఎవరు అసినా ..మరెవరు... ముందు అది చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Story first published: Wednesday, April 22, 2026, 5:11 [IST]