కమల్ హాసన్ 'ఇండియన్ 2'ని పక్కన పెట్టేసాడా.. మరింత ఆలస్యం?

ఇండియన్ సినిమా సీక్వెల్ కోసం కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమల్ కెరీర్ ని మార్చేసిన దర్శకుల్లో శంకర్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా శంకర్ స్థాయి పెరగడానికి ఇండియన్ సినిమా చాలానే ఉపయోగపడింది. ఇక అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే సౌత్ ఆడియెన్స్ లో అంచనాకు భారీగానే ఉంటాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తీవ్ర స్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

బడ్జెట్ విషయంలో శంకర్ కి నిర్మాతలకు మొదట్లోనే అభ్యంతరాలు తలెత్తాయి. ఇక షూటింగ్ లో పెద్ద యాక్సిడెంట్ అవ్వడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక మరికొన్ని రోజులకే కరోనా వైరస్ లాక్ డౌన్ మొదలవ్వడంతో మరింత ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటే పెద్ద సినిమా కాబట్టి ఎక్కువమందితో రిస్క్ చేయడం ఎందుకని సైలెంట్ అయ్యారు.

Kamal hasan Indian 2 release date latest update

అయితే కమల్ హాసన్ కొన్ని చిన్న సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఇండియన్ 2కి గ్యాప్ ఇవ్వక తప్పదు. కారోన్ వైరస్ తగ్గినా కూడా ఇప్పట్లో షూటింగ్ కి రాలేనని శంకర్ కు క్లారిటీ ఇచ్చేశాడట. దీంతో ఇండియన్ 2 వచ్చే ఏడాది రాదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక షూటింగ్ తొందరగా పూర్తి చేయకుంటే 2022సంక్రాంతికి రావడం కూడా అనుమానమే. అందుకే సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X