హాట్ బ్యూటీస్‌తో తమిళ బిగ్‌బాస్ 4.. ఇంట్లో టాలీవుడ్ టాప్ నిర్మాత కొడుకు.. కమల్ టీమ్‌లో హాట్ స్టార్స్

మొత్తానికి బిగ్ బాస్ తమిళ్ షో కూడా గ్రాండ్ గా మొదలైంది. కమల్ హాసన్ హోస్ట్ గా నాలుగవ సీజన్ ని మంచి ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేశారు. శనివారం హిందీ బిగ్ బాస్ మొదలవ్వగా మరుసటి రోజే తమిళ్ షో మొదలవ్వడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ నేమ్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక తమిళ్ షోకి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఆడియెన్స్ కి సరికొత్త కిక్కిచ్చింది. ఈ సారి కూడా కాంట్రవర్సీతో షోకి హైప్ తెచ్చే వారిని సెలెక్ట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్

గత కొన్నిరోజులగా వైరల్ అవుతున్న లిస్ట్ లో దాదాపు సగం మంది హోజ్ లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 4 హౌజ్ లోకి అడుగు పెట్టిన వారు.. రియో రాజ్, సనమ్, రేఖ, బాలా, అనితా సంపత్, ఆరి అర్జున, వెల్మురుగన్, సూపర్ గుడ్ అధినేత కుమారుడు, నటుడు జీవా సోదరడు జితాన్ రమేష్, రమ్య పాండియన్, 'అరంతంగి' నిషా, గాబ్రియెల్లా, సోమశేఖర్, ఆలీవీధర్ సమ్యూక్తా, శివానీ నారాయణన్..

 సరికొత్తగా మొదలుపెట్టిన కమల్ హాసన్

సరికొత్తగా మొదలుపెట్టిన కమల్ హాసన్

ఈ షో 100రోజుల లోపే ఉంటుందని తెలుస్తోంది. కమల్ హాసన్ తన హోస్టింగ్ తోనే షోను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. తన డిఫరెంట్ లుక్ తో కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తూ వారిపై పంచ్ లు కూడా వేశారు. ముఖ్యంగా ఆరి అర్జున, వెల్మురుగన్, జితాన్ రమేష్, రమ్య పాండియన్ వంటి కంటెస్టెంట్స్ ని సరికొత్త పరిచయం చేస్తూ మరికొందరితో స్టెప్పులు కూడా వేశారు.

అందరిచూపు ఆమె వైపే..

అందరిచూపు ఆమె వైపే..

కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎక్కువగా అందరి చూపు నటి రమ్య పాండియన్ పైనే ఉంది. ఆమె ప్రముఖ నటుడు, నిర్మాత అరుణ్ పాండియన్ మేనకోడలు. బయోమెడికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రమ్య ‘డమ్మీ తప్పాసు' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘జోకర్' (మల్లి), ‘ఆన్ దేవతై' (జెస్సి) సినిమాల్లో ఆమె నటనకు అభిమానుల నుండి భారీ ప్రశంసలు లభించాయి. ఇక బిగ్ బాస్ లో ఆమె మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గ్లామర్ తో హీటెక్కించే బ్యూటీ

గ్లామర్ తో హీటెక్కించే బ్యూటీ

సంయుక్త కార్తీక్ గా ప్రసిద్ది చెందిన మోడల్ సమ్యక్త షణ్ముగనాథన్ పై కూడా ఓ వర్గం వారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమిళ్ మళయాళ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ షోలో గ్లామర్ తో హీటెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో కంటెస్టెంట్ శివాని నారాయణన్ పై తమిళ జనాలు ఎక్కువగా ఫోకస్ చేయహరు. సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న ఈ నటికి బుల్లితెర అభిమానుల సపోర్ట్ గట్టిగానే ఉంటుందని టాక్

Recommended Video

Maddy Ane Madhav Muchattaina Moovannela Janda Mana India Song
సీనియర్ మోస్ట్ యాంకర్ కూడా..

సీనియర్ మోస్ట్ యాంకర్ కూడా..

ఇక తమిళ్ బుల్లితెరపై యాంకర్ గా 18 సంవత్సరాల అనుభవం ఉన్న యాంకర్ అర్చన చాందోక్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కామెడీ టైమ్ షోకు సహ-హోస్ట్‌గా ఆమె యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. సరిగమపా లిటిల్ చాంప్స్ సీజన్ 1,2లతో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. సినిమాల్లో కూడా నటించిన ఈ యాంకర్ బిగ్ బాస్ షోలో ఎలాంటి రచ్చ చేస్తుందో అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X