కమల్ హాసన్ డైరక్ట్ చేసే హాలీవుడ్ చిత్రం డిటేల్స్
తాను ఆస్కార్ అవార్డు కోసం హాలీవుడ్‌లో నటించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హాలీవుడ్‌లోనే వుండిపోనని, ఎప్పటిలానే అన్ని భాషాల్లో నటిస్తానని పేర్కొన్నారు. 'విశ్వరూపం' సినిమాను తమిళం, హిందీలలో రూపొందిస్తున్నట్లు చెప్పిన కమల్.. 'ఈ రెండు భాషల చిత్రాల్లో ఏదైనా వ్యత్యాసముందా' అని మీడియా వారు ప్రశ్నకు 'దాని గురించి ఇప్పుడే చెప్పను' అని సమాధానమిచ్చారు. హాలీవుడ్ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని, ఆ సినిమాను నిర్మాత బెర్రీ యాస్బెన్ రూపొందిస్తున్నారని కమల్ వివరించారు.
కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న చిత్రం విశ్వరూపం. కమల్ తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 13న విడుదల కానుంది. పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వాహెబ్, శేఖర్‌కపూర్, రాహుల్ బోస్, ఆండ్రియ, జైదీప్ అహ్లావత్ నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. అలాగే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని సమాచారం. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












