కమ్యూనిజంపై కమల్ సినిమా...టైటిల్ ఏంటంటే
చెన్నై: గతంలో ఒకదాని తర్వాత మరో చిత్రం చేసేవారు కమలహాసన్. ప్రస్తుతం ఆ ట్రెండ్‌ను ఆయన ప్రస్తుతం మార్చుకున్నారు. వరుసపెట్టి చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ కోవలోనే 'ఉత్తమ విల్లన్', 'విశ్వరూపం-2', 'పాపనాశం'లో ఆయన నటించారు. దీంతో ఈ చిత్రాలు దాదాపుగా ఒకే సీజన్‌లో వరుసగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
https://www.facebook.com/TeluguFilmibeat
ఒకటి విడుదలైతే చాలని ఎదురుచూసే కమల్ అభిమానులకు దీంతో పండుగ వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. మరో చిత్రంలోనూ నటించడానికి కమలహాసన్ అంగీకరించారని, దానికి 'వామ మార్గం' (లెఫ్ట్ హ్యాండ్)అనే టైటిల్ కూడా ఖరారైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కమ్యూనిజం మీద ఉంటుందని సమాచారం. గతంలోనూ ఆయన కమ్యూనిజం సిద్దాంతం ఆధారంగా..సత్యమే శివం అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే.

జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.
మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం' రీమేక్ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్ భార్యగా నటిస్తున్న చిత్రమిది.
దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











