టిప్పు సుల్తాన్ వేషంలో కమల్ హాసన్...!

By Sindhu

చారిత్రక కథలు, పాత్రలపై కమల్‌హాసన్‌కి ప్రత్యేక ఆసక్తి. త్వరలో ఆయన ఓ చారిత్రక చిత్రంలో నటించే అవకాశాలున్నాయని చెన్నై సమాచారం. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నించే ప్రముఖ నటుడు కమల హాసన్, తన తదుపరి చిత్రానికి ఓ చారిత్రిక కథాంశాన్ని ఎంచుకుంటున్నాడు. పోరాటయోధుడు టిప్పు సుల్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది.

టిప్పు సుల్తాన్ కీ, మలబారు రాణికీ మధ్య జరిగిన సంఘటనల సమాహారంతో ఇది నిర్మాణం అవుతుంది. ఇందులో కమల్ టిప్పు సుల్తాన్ గా నటిస్తాడు. మలయాళ దర్శకుడు మాధవన్ కుట్టి డైరెక్షన్లో గోకులం గోపాలన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X