ట్రాఫిక్ కానిస్టేబుల్ గా యూనివర్సల్ సూపర్ హీరో..!
కమల్ హాసన్ ఏ పాత్ర పోషించినా దానికో ప్రత్యేకత వుంటుంది. తాజాగా ఆయన పోషించబోయే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కూడా అటువంటిదే. ఇటీవల మలయాళంలో వచ్చిన 'ట్రాఫిక్' అనే సినిమా కమల్ ని బాగా ఆకట్టుకుందట. దాంతో ఆ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేసే పనిలో పడ్డాడిప్పుడు. ఇందులో తను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటిస్తాడట. ఇదిలా ఉంచితే, సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తాను నటించనున్న విశ్వరూపం సినిమా షూటింగ్ విదేశాలలో జరగాల్సి వుంది., అయితే, యూనిట్ కి వీసాలు రావడంలో జాప్యం జరుగుతోంది. దాంతో ఈలోగా ఈ కానిస్టేబుల్ సినిమాలో నటించడానికి కమల్ ప్లాన్ చేసుకుంటున్నాడని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని తమళంతో పాటు తెలుగు భాషలో కూడా రీమేక్ చేయానుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











