బాలుమహేంద్ర దర్శకత్వంలో కమల్‌హాసన్?
కమల్, బాలు మహేంద్ర రిపీట్ కానుందని సమాచారం. వీరి కాంబినేషన్లో గతంలో సతీ లీలావతి, వసంత కోకిల చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో వీరి కాంబినేషన్ రిపీట్ చేయటం కోసం చాలా కాలంగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే కమల్ గొప్ప స్క్రిప్టు వస్తేనే గానీ చేయననటంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇంతకాలానికి బాలు మహేంద్ర చెప్పిన లైన్ కమల్ ని ఇంప్రెస్ చేయటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన తెలుస్తోంది. ఇక కమల్ ఈనాడు..ఎ వెడ్నస్ డే రీమేక్ తర్వాత ఏ చిత్రమా కమిట్ కాలేదు. ముందుగా ఆయన స్వీయ దర్శకత్వంలో అనుకున్న మర్మయోగి ముందుకు వెళ్లలేదు.
More from Filmibeat
కమల్ హాసన్ ఎ వెడ్నస్ డే ఈనాడు నిరీక్షణ బాలు మహేంద్ర సతీ లీలావతి వసంత కోకిల మర్మయోగి balu mahendra sathi leelavathi vasantha kokila kamalhassan a wednes day eenadu marma yogi


Click it and Unblock the Notifications











