స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టిన ‘కమల హాసన్’
పద్మశ్రీ కమలహాసన్ నటుడిగా 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన స్వర్ణోత్సవంలో అడుగుపెట్టారు. కమలహాసన్ బాల నటుడుగా నటించిన కలత్తూర్ కన్నమ్మ తమిళ చిత్రం సరిగ్గా ఈ రోజే విడుదలయ్యింది(ఆగస్ట్ 12). ఈ సినిమా విడుదలై 49 యేళ్ళు అవుతోంది. ఇన్ని సంవత్సరాల్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ తదితర భాషల్లో కమలహాసన్ రెండు వందల చిత్రాలకు పైగా నటించారు.
ఇన్నేళ్ళ కెరియర్లో కమల్ అందుకున్న అవార్డులు, రివార్డులు కోకొల్లలు. నాయకుడు, భారతీయుడు, భామనే సత్యభామనే, సాగరసంగమం, స్వాతిముత్యం, క్షత్రియపుత్రుడు, ఇంద్రుడు-చంద్రుడు, ఆకలిరాజ్యం, లాంటి విభిన్న తరహా చిత్రాలు ఎన్నో కమల్ నుంచి వచ్చాయి. కమల్ నటనకు ఈ చిత్రాలు అద్దం పట్టాయి. ఈ లోక నాయకుడు గోల్డెన్ జూబ్లీలోకి ఎంటరయిన సందర్భంగా ఆయనకు దట్స్ తెలుగు తరపున శుభాకాక్షలు తెలుపుతున్నాము.
kamal hassan golden year awards bharateeyudu swathi muthyam sagara sangamam కమల హాసన్ స్వర్ణోత్సవం నాయకుడు స్వాతిముత్యం క్షత్రియపుత్రుడు ఇంద్రుడుచంద్రుడు ఆకలిరాజ్యం


Click it and Unblock the Notifications