‘ట్రాఫిక్’లో ఇరుక్కుపోవటానికి కమల హాసన్ ఉత్సాహం
ట్రాఫిక్ చిత్రం రీమేక్‌లో కమలహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిందీ చిత్రం. ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు ఇటీవల కేరళలోని ఎర్నాకులంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలహాసన్ చిత్ర యూనిట్ వర్గాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే వేదికపై ఆయన ట్రాఫిక్ తమిళ రీమేక్‌లో తాను నటించనున్నట్లు ప్రకటిం చారు.ఈ చిత్రంలో కమల్ మలయాళ నటుడు రెహ్మాన్ పోషించిన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రాజేష్ పిళ్లై తెలుపుతూ ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలి పారు. కాగా ఈ చిత్రాన్ని కమలహాసన్ తమిళంలోకి సొంతంగా నిర్మించనున్నట్లు తెలిసింది. అలాగే కమల్ మినహా ఇతర నటీనటులందరూ మలయాళ చిత్రం లో నటించిన వారే. తమిలంలోనూ నటించనున్నారని సమాచారం. ఇందులో హీరోయిన్లుగా సంధ్య, రమ్య నంబీశన్‌లు నటించారు.సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న విశ్వరూపం చిత్రం ఆల స్యం కానుండడంతో ఈలోగా ఇందులో నటించాలని అనుకుంటున్నట్లు తెలిసింది.ఈ చిత్రంలో ఆయన పాత్ర ట్రాఫిక్ కానిస్టేబుల్. ఈ చిత్రాన్ని చెనై లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందించారు.


Click it and Unblock the Notifications











