తండ్రి దగ్గర మెలకువలు నేర్చుకుంటున్న తనయ...!?
కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్షర హాసన్ కి డైరెక్షన్ మీద ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం తల్లి సారిక కీలక పాత్ర పోషిస్తున్న హిందీ చిత్రం 'సొసైటీ" కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోంది.
సినిమా డైరెక్షన్ పట్ల మనసు పారేసుకున్న కమలహాసన్ చిన్న కూతురు అక్షర, చివరికి తన తండ్రి దగ్గరే అసిస్టెంట్ గా చేరుతోంది. అవును... కమలహాసన్ డైరెక్ట్ చేయనున్న 'విశ్వరూపం' సినిమాకి అక్షర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయనుంది. తండ్రి నుంచి దర్శకత్వ మెలకువలు నేర్చుకోవాలన్న తపనతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే తండ్రి దగ్గర వర్క్ స్టార్ట్ చేసింది కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మీద తండ్రి దగ్గర పని నేర్చుకుంటోంది. తాను సినిమా డైరెక్టర్ అవ్వడమే కాకుండా, ఎప్పటికైనా తన తండ్రిని డైరెక్ట్ చేయాలన్నది కూడా అక్షర ఆశయం. తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం డైరెక్షన్ పనిని ఔపోసన పడుతోంది..!


Click it and Unblock the Notifications