కమల్ హాసన్ కోరిక తీరేనా! 55 ఏళ్ల లోనూ చేస్తారట!

By Sindhu

భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. అతని వయస్సు 55 ఏళ్లు, అయితే కోరికలనేటివి వయస్సుతో పనిలేదంటారు. కమల్ హాసన్ తన 50 సినిమా నటజీవితాన్ని మొన్న ఈ మద్యనే పూర్తి చేసుకొన్నారు. కమల్ కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సాగరసంగమం"చిత్రం లో శాస్త్రీయ నృత్యకారుడిగా ఆయన చేసిన డాన్స్ చాలా మంది జౌత్సాహికులకు ఆదర్శంగా నిలిచింది. కమల్ సరసన అందాల తార జయప్రద నటన మరచిపోలేని 'తకిటిటతదిమి తందానా" అంటూ బావిపై తాగుతూ చేసిన డాన్స్ ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ చిత్రం తమిళంలో 'సలైంగ్ ఓలి" పేరుతో అనువాదమై అక్కడా సక్సెస్ అయింది. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయనకు నటుడిగా 50 ఏళ్లు. ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసిన 55 ఏళ్ళ కమల్ హాసన్ కు ఇంకా ఓ కోరిక మిగిలే ఉందట! అదేదో ఇంత వరకూ చేయని రోల్ మాత్రం కాదు. 'సాగరసంగమం" రీమేక్ లో నటించాలని ఉందట! ఎవరైనా దర్శకుడు ముందుకొస్తే రీమేక్ లో అదే రోల్ పోషిస్తారట! 55 ఏళ్ల వయసులో డాన్స్ ఏం చేస్తాడన్న డౌట్ అక్కర్లేదంటూ నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X