కమల్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్స్ ,నిర్మాత కంప్లైంట్
చెన్నై : కమల్‌హాసన్ అభిమానుల నుంచి తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని నిర్మాత కేఆర్ నగర పోలీసు కమిషనర్ జార్జ్‌కు ఫిర్యాదు చేశారు. 'విశ్వరూపం'ను థియేటర్లకన్నా ముందే డీటీహెచ్‌లో విడుదల చేయాలని నిర్ణయించారని, అయితే థియేటర్ల యజమానులు, నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశముందనే అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేశానని తెలిపారు. ఇందుకు నిరసనగా కమల్ అభిమానులు హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఫోన్ నెంబర్లను కూడా సూచించిన ఆయన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
కమల్‌హాసన్ కొత్త సినిమా 'విశ్వరూపం' విడుదల విషయంలో ఏర్పడిన వివాదం సమసిపోలేదు. ధియేటర్లలో విడుదలకుముందుగానే డీటీహెచ్ ద్వారా విడుదల చేసి తీరానని కమల్ మరోసారి తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం రాత్రి చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. డీటీహెచ్ విడుదల విధానం మంచి సినిమాలు ఎక్కువమందికి చేరడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం, ధియేటర్‌లకు వచ్చేసమయంలేని ఉన్నతస్థాయివర్గాలకోసమని తెలిపారు. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లు ప్రధాన ఆకర్షణ అని, అందువలన దీనిని ధియేటర్‌లలో చూస్తేనే ఎక్కువ ఆనందించగలుగుతారని పేర్కొన్నారు.
తమిళనాడు జనాభాలో కేవలం 3 శాతం మాత్రమే తమ ఇళ్ళలో డీటీహెచ్ సర్వీస్ కలిగిఉన్నారని, ఈ విడుదల వలన ధియేటర్‌లకు వచ్చి సినిమా చూసేవారి సంఖ్య ఏమాత్రం తగ్గబోదని తెలిపారు. విశ్వరూపం సినిమాను ఒక్కసారికోసంమాత్రమే డీటీహెచ్‌లో విడుదల చేస్తున్నామని, దీనిద్వారా రికార్డ్ చేయడం కుదరదని పేర్కొన్నారు. ఇంట్లో వంటగది ఉన్నా, హోటళ్ళకు వెళుతున్నట్లే, ఇంట్లో దేముడి పటాలు ఉన్నా తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళుతున్నట్లే డీటీహెచ్ విడుదల ఉన్నా ధియేటర్‌లకు వచ్చే ప్రేక్షకులసంఖ్య తగ్గబోదని వ్యాఖ్యానించారు. పైగా మళ్ళీమళ్ళీ వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు.
విడుదలకు 8 గంటలముందు టాటా స్కై డీటీహెచ్ ద్వారా విడుదల చేయాలన్నది కమల్ ఆలోచన. అయితే, తమిళనాడులోని ధియేటర్‌ల యజమానులు మాత్రం ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా విడుదల చేస్తే ధియేటర్‌లకు ఎవరూ రారన్నది వారివాదన. కమల్ వెనక్కు తగ్గకపోవడంతో ధియేటర్‌ల యజమానులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికికూడా తీసుకెళ్ళారు.
కమల్‌ను చూసి ఇతర చిత్రనిర్మాతలు కూడా ఇదే ఒరవడి సృష్టించితే తమ సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కొంత ఫీజు వసూలు చేసిన తరువాతే డిటిహెచ్‌కు విడుదల చేస్తామని ఈ చిత్రాన్ని టివిలలో చూసినవారు సినిమాహాలులో అయితే ఇంకా బాగా చూడవచ్చని వస్తారని అందువల్ల థియేటర్ యజమానులు ఆందోళన చెందనక్కరలేదని కమల్ చెబుతున్నారు. అయినప్పటికీ ఈ కొత్త సాంప్రదాయం నచ్చని సినిమాహాళ్ల యజమానులు శుక్రవారం తమిళనాడు సిఎం జె.జయలలిత జోక్యంచేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని తమిళనాడు సినీ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మీడియాకు చెప్పారు.


Click it and Unblock the Notifications











