శృతి హాసన్ తో కలిసి నటించటంపై కమల్
తెలుగు తమిళ భాషల్లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆమె కెరీర్ లో పెద్ద హిట్స్ లేకపోయినా ఆఫర్స్ కు మాత్రం లోటు లేదు. ప్రస్తుతం పవన్ సరసన గబ్బర్ సింగ్ లో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన తండ్రి కమల్ తో కలిసి నటించాలనే కోరికను రీసెంట్ గా వ్యక్యం చేసింది. దీనిపై కమల్ ని మీడియావారు ఆడగగా...శృతి స్వప్రయత్నంతోనే హిందీ, తెలుగు, తమిళం భాష ల్లో అవకాశాలను పొందారు. తండ్రిగా ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. నాపై ఉన్న ప్రేమతోనే శృతి నాతో కలిసి నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసి ఉండవచ్చు. అది అంత సులభంగా జరిగే పని కాదు. మంచి స్క్రిప్ట్ లభించాలి అన్నారు.
ఇక తన తాజా చిత్రం విశ్వరూపం గురించి మాట్లాడుతచూ...విశ్వరూపం చిత్రం 120 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంటుందని ఆయన అన్నారు. అంతేగాక విశ్వరూపం చిత్రం కచ్చితంగా ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది. తమిళం, హిందీ భాషల్లో అందనంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అమెరికా లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన పూజాకుమార్ హీరోయిన్, మరో ముఖ్య పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలు, అమెరికా, బ్రిటన్‌దేశాల్లో చిత్రీకరిస్తున్నాం అన్నారు. మరి వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో ఏ దర్శకుడు వీరిద్దరనీ కలుపుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











