రామ్ చరణ్ ను చూసి ఈర్శపడ్డ యూనివర్సల్ హీరో...

By Sindhu

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజాను చూస్తుంటే కమల హాసన్ కి అసూయ కలుగుతోందట. "చిరంజీవి, నేను మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి చెన్నయ్ వీధుల్లో తిరిగాం. ఇప్పుడు వాళ్ళబ్బాయి రామ్ చరణ్ నటించిన 'మగధీర' చూస్తుంటే ఆర్టిస్టుగా నాకు అసూయ కలుగుతోంది. అంత బాగా నటించాడు" అన్నాడు కమల్. 'మగధీర' సినిమాని అల్లు అరవింద్, ఉదయనిధి వారి రెడ్ గైంట్స్ మూవీ బ్యానర్ లో తమిళంలోకి 'మావీరన్' పేరుతో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నారు. దీని ఆడియో వేడుక చెన్నయ్ లో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన కమల్ చరణ్ ను అభినందిస్తూ మాట్లాడాడు. ఇంకా మణిరత్నం, కె.యస్.రవికుమార్ కూడా చరణ్ నటనను ప్రశంసించారు. చరణ్ కూడా ఈ వేడుకలో పాల్గొని, చెన్నయ్ తో తనకున్న అనుబంధాన్ని, కమల్ పట్ల తనకున్న అభిమానాన్ని వివరించాడు. కోలీవుడ్ సమాచారం ప్రకారం మావీరన్ ట్రైలర్స్ చాలా అధ్బుతంగా వున్నాయని, మంచి స్పందనవస్తోందని సమాచారం. అలాగైతే చరణ్ కోలీవుడ్ లో కూడా మావీరన్ తో రికార్డ్ నెలకొల్పడం కాయం అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X