శ్రుతి కోసం కలం పట్టిన కమల్‌హాసన్‌

By Srikanya

చెన్నై : కమల్‌హాసన్‌ తాజాగా తన కుమార్తె శ్రుతి కోసం ఓ పాట కూడా రాశారట. హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రుతిహాసన్‌ తనకు ఎంతో ఇష్టమైన సంగీతంలో కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అస్సోంకు చెందిన జోయ్‌ పరువా అనే సంగీత కళాకారుడితో కలిసి ఓ ఆల్బమ్‌ను రూపొందిస్తోంది. ఒరియా, తమిళ భాషల్లో దీన్ని తీసుకొస్తున్నారు.

తమిళంలో దీనికోసం తన తండ్రితో ఒక్క పాటైనా రాయించాలని నిశ్చయించకున్న శ్రుతి... కమల్‌కు తన కోరిక వినిపించదట. 'విశ్వరూపం-2' నిర్మాణాంతర పనులు, 'ఉత్తమ విలన్‌' షూటింగ్‌, 'దృశ్యమ్‌' రీమేక్‌ సన్నాహాల్లో బిజీగా ఉన్నప్పటికీ కుమార్తె కోరిక మేరకు కమల్‌ ఓ పాట రాసి ఆమె చేతిలో పెట్టారట. ఎంతైనా తండ్రి ప్రేమ కదా అంటున్నారు తమిళ సినీ వర్గాలు.

Kamal Hassan gift it to his Daughter Shruthi Hassan

ఇక రీసెంట్ గా శ్రుతి హాసన్ మళ్లీ గొంతు సవరించుకుంది. అల్లు అర్జున్‌ తో ఆమె చేస్తున్న 'రేసుగుర్రం' లో ఆమె ఓ పాట పాడింది. ఇందులో 'డౌన్‌ డౌన్‌ డుప్పా..' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రుతిహాసన్‌ ఆలపించింది. ఈ పాటకి అల్లు అర్జున్‌తోపాటు ఆమె కూడా డ్యాన్స్‌ చేసింది. ఈ పాటని రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరించారు. బాలీవుడ్‌ నృత్య దర్శకుడు ఫిరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు సమకూర్చారు.

గబ్బర్ సింగ్, బలుపు చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి ..అటు హీరోయిన్ గా...అదరకొడుతూనే మరో ప్రక్క పాటలు పాడే కార్యక్రమం కూడా పెట్టుకుంది. తాజాగా ఆమె తమిళంలో ఓ పాట పాడింది. తెలుగులో హిట్టైన అలా మొదలైంది చిత్రం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమె చేత ఓ పాటను పాడించారు. షటప్ యువర్ మౌత్ అంటూ సాగే ఈ పాట బాగా వచ్చిందని, అది హిట్టై ఆమెను అందరూ తమి సినిమాల్లో ఒక పాటపాడమని అడుగుతారని దర్శకుడు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X