కమల్ 'మర్మయోగి' ఆగినట్లేనా?

By Staff

గత కొద్ది నెలలుగా విపరీతమైన పబ్లిసిటీతో వినపడుతున్న కమల్‌ 'మర్మయోగి' ఆగినట్లా..వాయదాపడినట్లా అన్నది చెన్నై వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదట కమిట్ అయినట్లుగా రాజకమల్‌ ఇంటర్నేషనల్‌, పిరమిడ్‌ సాయ్‌మీరా సంస్థలు సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు భారీ వ్యయమవుతుందని ఓ అంచనా. గత నెలలోనే దీని చిత్రీకరణ ప్రారంభమవుతుందని నిర్మాతలు పేర్కొన్నప్పటికీ - తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

అలాగే ఈ చిత్రం నిర్మాణ భాగస్వామ్యం నుంచి పిరమిడ్‌ సాయ్‌మీరా తప్పుకోనున్నట్లు, ఆ స్థానంలో మరో కార్పొరేట్‌ సంస్థ చేరబోతున్నట్లు సమాచారం. ఇక మర్మయోగి చిత్రం ఆలస్యం అవుతున్నందున పూర్తి స్థాయిలో ఒక హాస్య చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించే ఆలోచనలో కమల్‌ హాసన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి 'తలైవన్‌ ఇరుక్కాన్‌' అనే పేరు పెట్టారని చెప్తున్నారు.అంటే ఈ సినిమాకూడా మరుదనాయికం రూట్ లోనే ప్రయాణిస్తున్నట్లేనా అనేది అందరికీ సందేహం కలుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X