నలుగురు రతీదేవిలతో ఇద్దరు చిలిపి మన్మథులు...?
ఇప్పటికీ మన్మథుడు ఎవరంటే కమల్ హాసన్ పేరే ముక్తకంఠంతో చెబుతారు. దానికి తగ్గట్టుగా త్వరలో కమల్ నటించే మన్మథన్ అంబు చిత్రం విడుదల కాబోతోంది. లాగే తెలుగు సినీ ఫీల్డ్ కు సంబంధించి అమ్మాయిల కలల రాకుమారుడు..మన్మథుడు ఎవరని అడిగితే అక్కినేని నాగార్జున అని అంటారంతా. అందుకే నాగార్జునతో మన్మథుడు అనే పేరుతో ఓ చిత్రం రూపొంది ఘన విజయం కూడా సాధించింది.
విషయం ఏమిటంటే వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు మన్మథబాణం, రగడ ఒక రోజు తేడాలతో విడుదల కానున్నాయి. ఇక ఈ మన్మథులకు జోడీగా కమల్ హాసన్ తో మన్మథబాణం చిత్రంలో త్రిష జతకడుతోంది. నాగార్జున హీరోగా వస్తున్న రగడ చిత్రంలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అనుష్క ప్రధాన హీరోయిన్ కాగా ప్రియమణి, ఛార్మి నాగార్జునతో చిందెయ్యబోతున్నారు. ఇలా ఇద్దరు మన్మథులతో నలుగురు రతీదేవిలు ఈ వారం వెండితెరపై కనువిందు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











