కమల్ హాసన్ 'ఈనాడు'

By Staff

Kamal Hassan
అప్పట్లో ఈనాడు పేరుతో కృష్ణ హీరోగా ఓ చిత్రం వచ్చి హిట్టయింది. ఇప్పడు మళ్ళీ అదే పేరుతో కమల్ హాసన్ మరో చిత్రం తెరకెక్కించటానికి రెడీ అయ్యారు. హిందీలో సూపర్ హిట్టయిన 'ఎ వెన్స్‌డే' రీమేక్ గా ఈ చిత్రం తయారవుతోంది. నసీరుద్దీన్‌ షా, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రధారులుగా చేసిన ఈ చిత్రం రీమేక్ లో కమల్ హాసన్, మోహన్ లాల్ కనిపిస్తారు. తెలుగు వెర్షన్ కి మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు. ఈ ప్రాజెక్టుని కమల్ యూటీవీతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తారు. సాగరసంగమంలో భంగిమ కుర్రాడుగా పాపులర్ అయిన చక్రి ఈ ప్రాజెక్టును దర్శకత్వం వహిస్తారు. కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో సెట్‌ వేస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X