అనుష్క తో రొమాన్స్ చేయాలన్న లోకనాయకుడు...
టాలీవుడ్, కోలీవుడ్, సినీ ఆఫర్లతో ఉబ్బితబ్బిబ్బవుతున్న సెక్సీ తార అనుష్కకు కమల్ హాసన్ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఆ మద్య అనుష్క నటించిన అరుంధతి తమిళంలోనూ విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం తర్వాత సూర్యతో 'సింగం" చిత్రంలో నటించింది. అది కూడా సూపర్ హిట్. దీంతో తమిళనాట అనుష్కకు డిమాండ్ పెరిగిపోయింది. నిర్మాతలు, దర్శకులు అనుష్క డేట్స్ కోసం పడుగాపులు కాస్తున్నారని సమాచారం. ప్రయోగాలు చేసే కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలో అనుష్కను తనకు జోడీగా నటింపజేయాలని ఆమెను కోరినట్టు సమాచారం. అనుష్కకు కూడా ప్రయోగాలంటే ఇష్టమే కనుక కమల్ వెంటనే ఒప్పేసుకున్నదట..


Click it and Unblock the Notifications











