కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ ఆరోజేనా?
హైదరాబాద్: కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉత్తమ విలన్' షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అఫీషియల్ ప్రకటన వెలువడటమే ఆలస్యం.
ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో కమల్ హాసన్ పోషిస్తున్న మనోరంజన్ పాత్రకు భార్యగా ఊర్వశి నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ మనోరంజన్ మామ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఆండ్రియా మనోరంజన్ ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో మనోరంజన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.

ఇక 8వ శతాబ్దానికి చెందిన ఉత్తమన్ పాత్ర విషయానికొస్తే....ఈ పాత్రకు జోడీగా పూజా కుమార్ నటిస్తోంది. 8వ శతాబ్దం బ్యాక్ డ్రాపులో నడిచే పార్టులో నాజర్, ముత్తరాజన్, జయరాం, పార్వతి మెల్టన్, ఎంఎస్ భాస్కర్ కనిపించనున్నారు. మొత్తానికి ఈచిత్రం కమల్ హాసన్ నుండి వస్తున్న మరొక వైవిద్యమైన చిత్రం.
ఉత్తమ విలన్ చిత్రానికి కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎం ఘిబ్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి సహజీవనం చేస్తున్న గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది. గిభ్రాన్ సంగీతం అందించారు. కమల్ హాసన్ గురువు, మెంటర్ అయిన బాలచందర్ కూడా ఈ సినిమాలో నిజజీవిత పాత్రలో కనిపించబోతున్నారట.


Click it and Unblock the Notifications











