twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ 'విశ్వరూపం' సెన్సార్ పూర్తి...కట్స్ ఎన్నంటే

    By Srikanya
    |

    చెన్నై : కమల్‌ హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికెట్‌కు అప్లై చేయగా సెన్సార్ బృందం చాలా సేపు సమాలోచనలు జరిపి కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని చెప్పారు. వాటిలో కొన్ని సన్నివేశ సందర్భాలకు కమల్ విపులంగా వివరణ ఇవ్వడంతో తృప్తి చెందిన సెన్సార్ బృందం చివరికి 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో విశ్వరూపం చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

    ఇక ఈ చిత్రం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.

    తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్.

    ఒకేరోజు మూడు నగరాల్లో ఈ ఆడియో వేడుక జరగనుంది. చెన్నయ్, కోయంబత్తూర్, మధురైలలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే కార్యక్రమాల్లో కమల్‌హాసన్‌ పాల్గొని సీడీలను విడుదల చేస్తారు. ఒకే రోజు మూడు నగరాల్లో కాబట్టి, ఓ చార్టర్డ్ ప్లేన్‌ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముందుగా మధురై, ఆ తర్వాత కోయంబత్తూర్, చివరిగా చెన్నయ్‌లో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

    English summary
    Kamal Hasan's prestigious film 'Viswaroom' is getting ready for release in December. The film is produced and directed by Kamal himself. It was earlier reported that the film's Hindi and Tamil versions completed censor. While the Tamil version recieved clean U certificate, Hindi Version got U/A certificate. Recently the film's telugu version went to censor. Members after watching the film suggested 14 cuts in the film after serious discussions.Kamal Hasan finally relented and agreed for the cuts after which the film was passed with U/A certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X