మళ్లీ 'ఢీ' టీహెచ్ అంటున్న కమల్ హాసన్
చెన్నై : విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి డీటీహెచ్ అంటున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం 'విశ్వరూపం'. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రాన్ని డీటీహెచ్‌లలో ప్రసారం చేయాలని చూశారు కమల్‌హాసన్. ఆ నిర్ణయంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
తర్వాత ముస్లిం సంఘాల వ్యతిరేకతతో 'విశ్వరూపం' పలు చిక్కులు ఎదుర్కొంది. మొత్తం మీద అవాంతరాలను అధిగమించి సూపర్‌హిట్‌గా నిలిచింది. రెండో భాగాన్ని కూడా ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. సాంకేతిక జోడింపులు పూర్తయిన అనంతరం సినిమాను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలి భాగం విషయంలో డీటీహెచ్ ప్రసార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కమల్ ... రెండో భాగాన్ని మాత్రం ఎలాగైనా డీటీహెచ్‌లలో ప్రసారం చేయాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. తొలి భాగం ఇచ్చిన అనుభవాలతో ఈ సారి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారట.
దీనికి సంబంధిచిన వివరాలు కొద్ది రోజుల్లోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటీహెచ్ ప్రదర్శన విషయంలో తన తొలి చిత్రం సమస్యలు ఎదుర్కొన్నా కమల్‌హాసన్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు.


Click it and Unblock the Notifications












