హాలీవుడ్ సినిమాకి కాపీ కాదంటూ కమల్
ఆంథోని హాప్‌కిన్స్ నటించిన హాలీవుడ్ చిత్రం'హన్నిబాల్'బేస్ చేసుకుని కమల్ 'విశ్వరూపం' చిత్రం చేశారనే వార్తలు మీడియాలో వినపడుతున్నాయి. దీనిపై మీడియావారు ఈ వార్త నిజమేనా? అనే ప్రశ్న కమల్ ముందుంచారు. దానికి కమల్ కాదని కొట్టిపారేస్తూ 'విశ్వరూపం' దేనికీ ఇన్‌స్పిరేషన్ కాదు. నా హృదయానికి దగ్గరైన కథతో ఈ చిత్రం చేశాను'' అని చెప్పారు.
అలాగే 'హన్నిబాల్' సినిమా అంటే నాకిష్టమే. ఒకవేళ ఆ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమా చేయాలనుకుంటే భవిష్యత్తులో చేస్తాను. ఇప్పుడు కాదు అని తేల్చి చెప్పారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను 'ఐఫా' వేడుకల్లో ఆవిష్కరించారు. అలాగే, గత నెల కాన్స్ చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. కమల్ తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 13న విడుదల కానుంది. పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వాహెబ్, శేఖర్‌కపూర్, రాహుల్ బోస్, ఆండ్రియ, జైదీప్ అహ్లావత్ నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని సమాచారం. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.
చిత్రం కథ ప్రకారం ఒక మధ్యతరగతి యువతి తన ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే నిరంతర కృషితో అమెరికాలో చదువుతుంది. నిరు అనే నిరుపమకు ఎస్ అనే విశ్వనాథన్‌కు మధ్య మూడేళ్ల ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ప్రేమ, పెళ్లితో జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిరుపమ పనిలో పనిగా పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్ నిరుపమా విశ్వనాథన్ హోదాను పొందుతుంది.
విశ్వనాథన్ తన కథక్ నాట్యశాల విద్యార్థులకు నృత్యం నే ర్పుతూ భార్యతో జీవితంలో స్థిరపడుతాడు. డాక్టర్ నిరుపమ విశ్వనాథన్ తన స్థాయికి తగ్గ భర్త కాదని ఆయన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. ఆయనలోని లోపాలను వెదకడానికి ఒక డిటెక్టివ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత ఏమయ్యేందనేది విశ్వరూపం చిత్రం అంటున్నారు. వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్ మహదేవన్, ఎషాన్‌నూరణి, లాయ్ మెంటోసా (శంకర్ ఎషాన్ లాయ్) సంగీతం అందించారు. ఇందులో కమలహాసన్ ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











