twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్ వివాదంలోకి "కమల్" కూడా: ఇన్ని వివాదాలతో తెలుగు వెర్షన్ పరిస్థితేమిటి???

    మెడికల్ మాఫియాని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా మెర్సల్ పై ఓ వైపు తమిళనాడు వైద్యులు - ఆ తర్వాత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ రంగంలోకి దిగిపోగా, కమల్ హాసన్ కూడా సీన్ లోకి వచ్చాడు.

    |

    మెర్సల్ ఈ మధ్య కాలంలో కోలీవుడ్ కి పేద్ద హిట్ ఇచ్చిన సినిమా ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఆశాజనక వసూళ్ళతో సాగిపోతున్న ఈ సినిమాకి రాజకీయం రంగు అంటుకుంటోంది. మెడికల్ మాఫియాని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా మీద రెండోరోజునుంచే నిరసనలు పతాక స్థాయిలో కనిపించాయి. ఆ సినిమా లో కొన్ని మాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ కూడా అధికార పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాను తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని చేపట్టిన కార్యక్రమాలపై ఈ వాఖ్యలు సరికాదంటూ బీజేపీ వర్గాలు నిరసన తెలుపుతున్నాయి.

    విజయ్ కి మద్దతుగా

    విజయ్ కి మద్దతుగా

    జీఎస్టీ అమలుపై చిత్రంలో ఉన్న డైలాగులను తొలగించాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఓ వైపు తమిళనాడు వైద్యులు - ఆ తర్వాత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ రంగంలోకి దిగిపోగా... కోలీవుడ్ కే చెందిన మరో సీనియర్ హీరో, ఇటీవలి కాలంలో రాజకీయంగా సంచలన కామెంట్లతో యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న కమల్ హాసన్ కూడా సీన్ లోకి వచ్చాడు. విజయ్ కి మద్దతుగా తానూ నిలబడ్డాడు.

    వాదనలు కరెక్ట్ కాదు

    వాదనలు కరెక్ట్ కాదు

    తమిళనాడు వైద్యులతో పాటు బీజేపీ నేతలు మెర్సెల్ చిత్రంపై చేస్తున్న వాదనలు కరెక్ట్ కాదని కమల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో మెర్సెల్ చిత్రంతో పాటుగా ఆ చిత్ర హీరో విజయ్ కు ఆయన అండగా నిలిచినట్లైందన్న వాదన వినిపిస్తోంది. సినిమాను అన్నివిధాలుగా సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందన్నాడు.

    సన్నివేశాలు తీసేయాల్సిన అవసరం లేదు

    సన్నివేశాలు తీసేయాల్సిన అవసరం లేదు

    అయినా సెన్సార్ పరిశీలన తర్వాతే కదా సినిమా విడుదలైందంటూ కాస్తంత కరకు స్వరాన్నే వినిపించిన కమల్.. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలైన చిత్రంలోని సన్నివేశాలను తీసివేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నించారు. తమిళనాడు వైద్యులు - బీజేపీ నేతలు చెబుతున్న వివాదాస్పద సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కూడా కమల్ పేర్కొన్నాడు.

    విమర్శలు చేయడంలో తప్పులేదు

    విమర్శలు చేయడంలో తప్పులేదు

    వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని కమల్ అభిప్రాయపడ్డారు. మరి ఈ వివాదం ఎంతదాకా దారి తీస్తుందో చూడాలి. ఈ వివాదాలు ఎలా ఉన్నా... రిలీజ్ కు ముందే హిట్ టాక్ అందుకున్న మెర్సెల్ తన పని తాను చేసుకు పోతోంది. బాక్సాఫీసు వద్ద తనదైన మార్కు కలెక్షన్లను రాబడుతోంది.

    తెలుగులో

    తెలుగులో "అదిరింది"

    కోలీవుడ్లో ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త రికార్డులు సాధిస్తుందనే అనుకుంటున్నారు. ఈ సినిమా రాబడుతున్న కలెక్షన్లు కూడా అదే చెప్తున్నాయి... అయితే ఈ సినిమా త్వరలో తెలుగులో కూడా "అదిరింది" పేరుతో రానుంది. మరి అప్పుడు ఇక్కడ కూడా ఇదే తరహా వివాదం మొదలవుతుందా? అన్నది ఇప్పుడు ఉన్న ప్రశ్న.

    English summary
    "Mersal was certified. Don't re censor it. Counter criticism with logical response. Don't silence critics. India will shine when it speaks," the Actor Kamal Haasan wrote on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X