స్వర్గానికి అతి దగ్గరలో త్రిష... ఫుల్ ఎంజాయి
స్వర్గంలో విహరిస్తున్నట్లుంది...చాలా ఆనందంగా ఉంది..ప్రస్తుతం నేనుంటున్న ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. చాలా సుందరమైన ప్రదేశమిది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను" అని త్రిష ఇటీవల తన ట్విట్టర్ లో రాసుకుంది. ఇంతకీ ఆమె అంతలా వర్ణించే ఆ ప్రదేశమేమిటంటే...స్విజ్జర్ లాండ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'మన్మథన్ అంబు' సినిమా కోసం కమల్ హాసన్ తో కలిసి స్విట్జర్లాండ్ లో ఉంది. కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ జయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఓ మెలోడీ రొమాంటిక్ బాణీని అక్కడ తెరకెక్కిస్తున్నారు. కమల్, త్రిషలపై జెనీవా, అక్కడి పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడి విశేషాలనే త్రిష తన ట్విట్టర్‌లో అందంగా పొందుపరచుకుంది.ఇక మన్మధన్ అంబులో సంగీత ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. అలాగే మాధవన్ కూడా ఈ చిత్రంలో నవ్వులు పండించటానికి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications