ఆల్ ఖైదా టెర్రరిస్ట్ అయిన యూనివర్సల్ హీరో...!?
కమల్ హాసన్ తన ప్రతి సినిమాలోనూ కొత్త కొత్త గెటప్స్ వేయడానికి ఇష్టపడుతుంటాడు. అందుకోసం ఎంతో రీసర్చ్ కూడా చేస్తుంటాడు. తాజాగా తన డైరెక్షన్లో రూపొందుతున్న 'విశ్వరూపం' సినిమాలో కూడా కొన్ని గెటప్స్ వేస్తున్నాడు. అందులో ఓ గెటప్ లో ఆల్ ఖైదా టెర్రరిస్ట్ గా ఓ గెటప్ వేశాడట. దీనికి సంబంధించిన షూటింగు ప్రస్తుతం చెన్నై లోని మహాబలిపురం పాత రోడ్డులో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ట్రిం చేయని పెద్ద గెడ్డంతో టెర్రరిస్ట్ గెటప్ లో వున్న కమల్ ని ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారట. అయితే, ఇందులో కమల్ ఓ మర్డర్ కేసును విచారించే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మరి, ఈ టెర్రరిస్ట్ గెటప్ లో ఎక్కడ కనపడతాడో?
కాగా ఈ చిత్రంలో గత కొద్ది రోజులుగా హీరోయిన్ల గండం ఏర్పడింది. ఈ చిత్రంలో సోనాక్షి, దీపికా పదుకునే వంటి హీరోయిన్లను నటించనున్నారంటూ వార్తల వచ్చాయి. కానీ అవన్నీ అబద్దాలే అని తేలిపోయాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుండి అనుష్క కూడా తప్పుకుందని తెలిసింది. దాంతో ప్రస్తుతం అనుష్క స్థానంలో సమీరా రెడ్డిని తీసుకున్నట్టు సమాచారం. కమల్ డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











