కమల్ హాసన్ కొత్త చిత్రం టైటిల్ అదే...
కమల్ హాసన్ నటించనున్న తాజా చిత్రానికి 'విశ్వరూబమ్"(విశ్వరూపం) అనే టైటిల్ ఖరారు చేశారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో కమల్ సరసన బాలీవుడ్ భామ 'దబాంగ్"ఫేం సొనాక్షి సిన్హా తన అందచందాల విశ్వరూపం ప్రదర్శిచనుంది.ఇక దర్శకుడు సెల్వ చెప్పిన ఈ కథ విని..చాలా థ్రిల్ అయ్యానని ఆమె అంటున్నారు. ఏప్రిల్ మొదటివారంలో చెన్నయ్ వెళ్లి, తన పాత్ర తీరుతెన్నులు, వస్త్రధారణ గురించి సెల్వరాఘవన్ దగ్గర ఆమె కలుస్తారు.ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ జెనర్ కి చెందింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇంకా తెలుగు, హిందీ వెర్షన్‌లకు టైటిల్స్‌ని నిర్ణయించలేదని చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం షూటింగ్‌ను ఆరంభించి హైదరాబాద్, చెన్నయ్, లండన్‌లో జరపాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వంద రోజుల్లో ఒకే ఒక షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటివరకు అనేక చిత్రాల ద్వారా నటుడిగా తన విశ్వరూపాన్ని చూపించిన కమల్‌హాసన్ ఇప్పుడు ఏకంగా అదే టైటిల్‌తో సినిమా చేయనున్నారంటే.. ఇక ఏ రేంజ్‌లో రెచ్చిపోనున్నారో అబిమానలు అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం హన్నీబాల్ అనే హాలీవుడ్ చిత్రానికి ఇండియన్ వెర్షన్ అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











