యూనివర్సల్ హీరో సినిమాలో అతిలోక సుందరి..!
సుమారు వంద కోట్లతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న 'విశ్వరూపం"లో సోనాక్షి సిన్హా ముఖ్య కథానాయిక. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరో హీరోయిన్ కూడా అవసరమంట. అందుకే ముందుగా శ్రియను స్పెషల్ గా కమల్ సరసన నటింపజేసేందుకు సన్నాహాలు చేసారు.
రోజురోజుకీ దిగజారుతున్న శ్రియ పాపులారిటీతో సినిమాకు ఎటువంటి లాభం చేకూరదని తెలుసుకున్న సెల్వ ఇప్పుడు శ్రీదేవిని ఆ స్థానంలో భర్తీ చేసే ప్రయత్నంలో వున్నాడు. పైగా ఫూర్వం కమల్, శ్రీదేవి కాంబినేషన్ లో చేసిన చిత్రాలన్నీ పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచాయి. ఆలస్యం చేయకుండా సెల్వ తన 'విశ్వరూపం" కథని శ్రీదేవికి వినిపించడం, నిలిచాయి. ఆలస్యం చేయకుండా సెల్వ తన 'విశ్వరూపం" కథని శ్రీదేవికి వినిపించడం, ఆమె మెచ్చుకోవడం కూడా జరిగిపోయాయంట..! అంటే మరోసారి అలనాటి కలయికను ఈనాడు చూడబోతున్నాం అన్నట్లేనా?


Click it and Unblock the Notifications











