Don't Miss!
- Technology Whatsapp Filters వాట్సాప్‌లో ఫిల్టర్స్ పేరుతో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!
- Sports IPL 2024: హార్దిక్ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- News టీడీపీ కోసం రంగంలోకి ముగ్గురు వ్యూహకర్తలు - గేమ్ ఛేంజ్..!!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
'విశ్వరూపం' ఆడియో విడుదల వాయిదా
'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్. ఒకేరోజు మూడు నగరాల్లో ఈ ఆడియో వేడుక జరగనుంది. చెన్నయ్, కోయంబత్తూర్, మధురైలలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే కార్యక్రమాల్లో కమల్‌హాసన్ పాల్గొని సీడీలను విడుదల చేస్తారు. ఒకే రోజు మూడు నగరాల్లో కాబట్టి, ఓ చార్టర్డ్ ప్లేన్‌ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముందుగా మధురై, ఆ తర్వాత కోయంబత్తూర్, చివరిగా చెన్నయ్‌లో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.
అలాగే ఈ చిత్రం రిలీజ్ సైతం వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.