twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' ఆడియో విడుదల వాయిదా

    By Srikanya
    |

    చెన్నై : కమల్‌ హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో తొలుత నవంబర్ 7న , అంటే కమల్ పుట్టిన రోజున విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ పంక్షన్ ని కమల్ భారీగా ప్లాన్ చేస్తూండటంతో ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఆడియో విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

    'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్. ఒకేరోజు మూడు నగరాల్లో ఈ ఆడియో వేడుక జరగనుంది. చెన్నయ్, కోయంబత్తూర్, మధురైలలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే కార్యక్రమాల్లో కమల్‌హాసన్‌ పాల్గొని సీడీలను విడుదల చేస్తారు. ఒకే రోజు మూడు నగరాల్లో కాబట్టి, ఓ చార్టర్డ్ ప్లేన్‌ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముందుగా మధురై, ఆ తర్వాత కోయంబత్తూర్, చివరిగా చెన్నయ్‌లో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

    అలాగే ఈ చిత్రం రిలీజ్ సైతం వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.

    తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    
 The audio launch of much-awaited film Viswaroopam, starring Kamal Hassan, has been postponed by a few weeks. The makers initially planned to have the audio release on November 7 to coincide with Kamal Hassan's birthday, but fresh reports say that the event was pushed back as the actor wanted to do the event on a larger scale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X