బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ఎ వెడ్నస్ డే చిత్రం తమిళ రీమేక్ లో కమల్ హాసన్ నటించే అవకాశాలున్నట్లు తమిళ మీడియా కోడై కోస్తోంది. మర్మయోగి ఆగి బ్యాడ్ మూడ్ లో ఉన్నాయన ఇట్లాంటి చిన్న సినిమాతో వస్తే మేలని యోచిస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఆయన ఆ రీమేక్ రైట్స కోసం ఎంక్వైరీ చేయటంతో ఇదంతా బయిటకు వచ్చిందని తెలుస్తోంది. ఇక కమల్ ఇందులో నసీరుద్దీన్ షా పాత్ర చేస్తారని, ఓ సామాన్యుడు నుండి అసమాన్యుడుగా కనపడే ఆ క్రమంలో కమల్ విశ్వరూపం చూపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే అనుపమ ఖేర్ పోషించిన పోలీసు అధికారి పాత్రను మళయాళ నటుడు ముమ్మట్టి పోషిస్తే ఎలా ఉంటుందన్న దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తమిళ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొందరు మాత్రం కమల్ హాసన్ ఈ సినిమాను తన రాజ్ కమల్ బ్యానర్ పై కేవలం ప్రొడ్యూస్ మాత్రమే చేస్తారని,తారాగణం వేరే వాళ్ళను తీసుకుంటారని చెప్తున్నారు.
Story first published: Wednesday, December 24, 2008, 17:48 [IST]