మగధీరకు రజనీ శభాష్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన వెట్టైయాడు - వెలియాడు (తెలుగులో మగధీర) చిత్రం తమిళనాట ఆగస్టు 25న విడుదలై విజయఢంకా మోగిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కూడా కమల్ నటనకూ, గౌతమ్ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోని అద్భుతమైన ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో హైలెట్స్‌గా చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రం ప్రివ్యూని ఇటీవల రజనీకాంత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా చూస్తున్నంత సేపూ రజనీ ఎంతో ఎంజాయ్ చేశారట. కొన్ని సన్నివేశాలలో దర్శకుడి ప్రతిభకు అబ్బురపడి సూపర్, ఎక్సెలెంట్ అంటూ కితాబు కూడా ఇచ్చారట రజనీ. కమల్ అద్భుతమైన నటన, అమెరికాలో స్థిరపడ్డ భారతీయ వనితగా జ్యోతిక పెర్ఫార్మెన్స్, కమిలినీ ముఖర్జీతో కమల్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో బాగా పండాయి. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తే ఎన్నో చక్కని సన్నివేశాలు ఆస్వాదించగలుగుతాం. మామూలుగా చూస్తే.. వాటిని మిస్ అవుతాం. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ మరో మైలురాయిని ఆవిష్కరించారు అని నటుడు సూర్య ప్రశంసించారు. గౌతమ్ మీనన్ మొదటి సినిమా కాకకాక చిత్రంలో హీరో సూర్యనే.
శింబు కూడా ఈ చిత్రం చూసి అబ్బురపడ్డాడు. చాలా స్టయిలిష్‌గా తీశారంటూ మెచ్చుకున్నాడు. నిర్మాణంలో ఉండగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చేతులు మారిన ఈ ప్రాజెక్టు చివరకు హిట్ చిత్రంగా టాక్ సంపాదించడంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం లభించిందని నిర్మాత మానిక్కమ్ నారాయణన్ సంతోషంగా ఉన్నారు. తెలుగులో మగధీర టైటిల్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











