ఇంకోటా...అయినా ఈ రీమేకుల పిచ్చేంటి?
చెన్నై: వేరే భాషలో ఓ అద్బుతమైన సినిమా ని చూసి, దాన్ని మన ప్రేక్షకులకు అందించాలనే తపనతో దాన్ని తెరకెక్కించటం గొప్ప విషయం అనిపించుకుంటుంది. లేదా కమర్షియల్ హిట్ దొరికినప్పుడు...డబ్బు చేసుకోవాలని నిర్మాతలు,దర్శకులు ఉవ్విళ్లూరటంలో అర్దముంది. అంతేకానీ కమల్ హాసన్ లాంటి దేశం మెచ్చిన ఆర్టిస్టు...ఎక్కడ రీమేక్ ఉందా అని వెతుక్కోవటం మాత్రం దారుణమే అనిపిస్తుంది. ప్రస్తుతం దృశ్యమ్ రీమేక్ చేస్తున్న కమల్ హాసన్ తాజాగా మరో మళయాళ రీమేక్ పై ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. అయినా అంత పెద్ద స్టార్ ఇలా ఒరిజల్ ఐడియాలతో వచ్చే దర్శకులను ఎంకరేజ్ చేయకుండా రీమేక్ లపై పడటం దారణమంటోంది తమిళ సిని పరిశ్రమ.
మళయాళంలో ఇంకా ప్రొడక్షన్ లో ఉన్న పెరుచాళి అనే చిత్రం రైట్స్ తీసుకోవాలని కమల్ హాసన్ ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న అరుణ్ వైద్య నాధన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం స్క్రిప్టుని తెలుసుకున్న కమల్ హాసన్...తను చేయాలని నిర్ణయించుకున్నాడని తమిళ మీడియా అంటోంది. అయితే దర్శకుడు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నాడు. కమల్ కి ఈ స్క్రిప్టు తెలుసు అని, నిజంగా ఆయన ఈ రీమేక్ లో చేస్తే అది తన అదృష్టం అని అంటున్నాడు.

విశ్వనటుడు కమల్‌హాసన్ చిత్రాలు మూడు ఈ ఏడాది విడుదల కానున్నాయన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా కమల్ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల చెంతకు రానుంది.
తన స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటిస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్ అరవింద్. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్‌లో కమల్ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











