పెళ్లికి హాజరైన కమల్, రజనీ

By Srikanya

తెలుగులో కథానాయుకుడు, నాగవల్లి, పృధ్వీ నారాయణ వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు పి.వాసు కుమారుడు పెళ్లి ఘనంగా చెన్నైలో జరిగింది. ఈ వివావానికి తమిళ సినీ పెద్దలంతా హాజరయ్యారు.ముఖ్యంతా కమల్ హాసన్,రజనీకాంత్ ఇద్దరూ రావటం అందరికి ఆనందమైంది.వివరాల్లోకి వెళితే..ప్రముఖ దర్శకుడు పి.వాసు కుమారుడు, నటుడు శక్తి వివాహం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తొట్టా ల్ పుమలరుం చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శక్తి మాంబాక్కంకు చెందిన ఎంకే మురళి, దుషిత దంపతుల కుమార్తె స్మృతి వివాహం సోమవారం ఉదయం 9.30 గంటలకు చెన్నై, అన్నామలైపురంలోని రామనాథశెట్టియార్ క ల్యాణ మండపంలో శాస్త్రోస్తంగా జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ 30వ తేదీ సాయంత్రం అదే కల్యా ణ మండపంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో రజినీకాంత్, కమల్‌ హాసన్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, శరత్‌కుమార్ రాధిక దంపతులు, సూర్య, కార్తీ, జయం రవి, రాధార వి, సత్యరాజ్, అర్జున్, త్యాగు, గౌండర్ మణి, సెంథిల్, పాండ్యరాజ్, వివేక్, ఆది, నాజర్, ఎం ఎస్ భాస్కర్, గీత రచయిత వాలి, నా ముత్తుకుమా ర్, చోరామస్వామి, మాజీ కేంద్ర మంత్రి అన్భుమణి రాందాస్, ఇలంగోవన్ పాల్గొన్నారు. వివాహ రిసెప్షన్‌లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, స్టాలిన్, తిరుమావలవన్, నటుడు పార్తిబన్, అరుణ్ విజయ్, రాంకుమార్, దుష్యంత్, విజయకుమార్, మంజుల, సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, స్పీకర్ జయకుమార్, మంత్రి ఓ పన్నీర్ సెల్వం, మేయర్ సైదై దురైస్వామి, నటీ కుష్బు, స్నేహ, సంజ్య, అనుష్క, శ్రీయ, నిర్మాత ఆర్‌బి చౌదరి, జికే రెడ్డి, ఏవిఎం శరవణన్, ఆర్‌ఎం వీరప్పన్ పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X