కమల్, రజనీ ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్

By Srikanya

చెన్నై: ఇప్పుడున్న పరిస్ధితుల్లో కమల్ ,రజనీ ఎలాగూ కలిసి నటించేటట్లు కనపడటం లేదు. అందుకేనేమో వారు గతంలో కలిసి చేసిన సూపర్ హిట్ చిత్రం రి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ కలిసి 33 సంవత్సరాల కిందట నటించిన సూపర్ హిట్ చిత్రం 'అందమైన అనుభవం'. ఈ సినిమాకి డిజిటల్‌ హంగులు అద్దబోతున్నారు. స్కోప్‌లోకి మార్చి, స్టీరియో సౌండ్‌లో సినిమాను మరోమారు విడుదల చేయాలని దర్శకుడు కె.బాలచందర్‌ భావిస్తున్నారు. 'కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు' అనే హిట్‌ గీతం ఈ చిత్రంలోనిదే.

రజనీకాంత్, కమల్‌హాసన్ వీరిద్దరూ కలిసి తొలినాళ్లలో చాలా సినిమాలు చేశారు. 1979లో వచ్చిన 'అందమైన అనుభవం' వీరి కలయికలో ప్రత్యేకమైనదిగా పేర్కొనాలి. వీరిద్దరికీ గురువైన కె.బాలచందర్ తెలుగు, తమిళ భాషల్లో దీన్ని రూపొందించారు. జయసుధ, జయప్రద, శరత్‌బాబు ఇత్యాది తారలంతా నటించారు. కథాకథనాలు, రజనీ, కమల్‌ల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతమైతే అద్బతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టే. అందమైన అనుభవం, హల్లో నేస్తం బాగున్నావా, కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు, నవ్వే నువ్వమ్మా, శంభో శివ శంభో, సింగపూరి సింగారి... పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మళ్లీ విడుదల కాబోవటం అబిమానలును ఆనందపరుస్తోంది. అదీ నూతన హంగులతో. సినిమా స్కోప్, స్టీరియో సౌండ్‌తో డిజిటల్ ఫార్మాట్‌లో ఈ సినిమాను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగటం చాలా హ్యాపీ న్యూసే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X