హాట్ బ్యూటీ అనూష్క పై కమల్ కన్ను
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా అనూష్కను తన గురువు బాలచందర్ కి పరిచయం చేసి రికమెండ్ చేసారని తెలుస్తోంది. అరుంధతి చిత్రం చూసి ఇంప్రెస్ అయిన కమల్ హాసన్ ఆమెను తన తదుపరి చిత్రంలో తీసుకోవాలని నిర్చయించుకున్నారు. అయితే అనుకున్నట్లుగా ఆ చిత్రం మెటీరియలైజ్ కాలేదు. దాంతో కమల్ ఆమెకు తన ప్రక్కన ఇస్తానని హామీ ఇచ్చి తమిళ పరిశ్రమలో పెద్ద వారికి ఆమెను పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం అనూష్క 'వేట్టైక్కారన్' అనే చిత్రంలో విజయ్ సరసన చేస్తోంది. మూడేళ్ల క్రితం 'రెండు' అనే తమిళ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది అనుష్క. అయితే ఆ చిత్రం ఊహించనంతగా వర్కవుట్ కాలేదు. దాంతో తర్వాత ఆమె మళ్లీ తమిళ సినిమాలు చేయలేదు.
తాజాగా 'వేట్టైక్కారన్' ద్వారా మరోసారి అనూష్క తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ 'వేట్టైక్కారన్' చిత్రంలో అనూష్క మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తుందని, మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో అలరిస్తుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, ట్రైలర్స్ చూసినవాళ్లు ఈ ఏడాది 'హిట్ పెయిర్' విజయ్, అనుష్కలదే అని అంటున్నారు. ముఖ్యంగా అనుష్క అందచందాలను కోలీవుడ్ వర్గాలు తెగ పొగిడేస్తున్నాయ్. 'వేట్టైక్కారన్' తర్వాత ఆమె కోలీవుడ్ లోనూ బిజీ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక కమల్ రికమండేషన్స్ కూడా తోడవటంతో ఆమెకు తమిళంలో ఎదురు ఉండే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











