కమల్‌హాసన్...ఈ యేడాది మూడు రిలీజ్ లు

తన స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటిస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్ అరవింద్. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్‌లో కమల్ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











