కమల్ 'విశ్వరూపం' రిలీజ్ ఫోస్ట్ ఫోన్
మరో ప్రక్క ఈ చిత్రం విడుదల కాకపోవటానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని అంటున్నారు. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వాహెబ్, శేఖర్‌కపూర్, రాహుల్ బోస్, ఆండ్రియ, జైదీప్ అహ్లావత్ నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని సమాచారం. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.
చిత్రం కథ ప్రకారం ఒక మధ్యతరగతి యువతి తన ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే నిరంతర కృషితో అమెరికాలో చదువుతుంది. నిరు అనే నిరుపమకు ఎస్ అనే విశ్వనాథన్‌కు మధ్య మూడేళ్ల ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ప్రేమ, పెళ్లితో జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిరుపమ పనిలో పనిగా పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్ నిరుపమా విశ్వనాథన్ హోదాను పొందుతుంది.
విశ్వనాథన్ తన కథక్ నాట్యశాల విద్యార్థులకు నృత్యం నే ర్పుతూ భార్యతో జీవితంలో స్థిరపడుతాడు. డాక్టర్ నిరుపమ విశ్వనాథన్ తన స్థాయికి తగ్గ భర్త కాదని ఆయన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. ఆయనలోని లోపాలను వెదకడానికి ఒక డిటెక్టివ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత ఏమయ్యేందనేది విశ్వరూపం చిత్రం అంటున్నారు. వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్ మహదేవన్, ఎషాన్‌నూరణి, లాయ్ మెంటోసా (శంకర్ ఎషాన్ లాయ్) సంగీతం అందించారు. ఇందులో కమలహాసన్ ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications












