కమల్ హాసన్ రెండో కూతురు అక్షర సీన్ లోకి వస్తోంది
కమల్ హాసన్ మొదటి కూతురు శృతిహాసన్ ఆల్రెడీ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయి నెంబర్ వన్ స్దానానికి పోటీ పడుతోంది.ఇక ఆయన రెండో కూతురు అక్షర హాసన్ రచయిత్రిగా మారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. ఓ హిందీ చిత్రానికి ఆమె అప్రెంటిస్‌గా చేస్తోంది కూడా.పనిలో పనిగా తనకు నచ్చిన జానపద కథలను సోషలైజ్ చేసుకుంటూ అనేక మంది నిర్మాతలకు వినిపిస్తోంది. ఈ కథలను మొదట తండ్రి కమలహాసన్‌కు వినిపిస్తోంది. ఆమె రాసిన కథల్లో తంజావూరు చోళ రాజు కథ ఎంతో నచ్చిందిట.అందుకే తాను కూడా ఆ కథను చిత్రంగా నిర్మించాలని నిర్మాతల వేటలో పడ్డాడు.ఎంతైనా కూతురు రచించిన కథ కనుక తానే నిర్మించవచ్చు కదా అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నేను తీయకపోయినా అందులో హీరోగా మాత్రం నటిస్తానని భరోసా ఇస్తున్నాడు కమల్. మొత్తానికి కూతురు మీద ప్రేమ ఆ రకంగా చూపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











