'మర్మ యోగి' మర్మం!!

కమల్ మాటల్లో...తర్వాత చిత్రం 'మర్మ యోగి' పూర్తిగా చారిత్రకమైనదే...అంతేగాక 'దశావతారం' కన్నా సంగీతానికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సబ్జెక్టు అది. యేడవ శతాబ్దానికి సంభందించిన కొన్ని చారిత్రిక ముఖ్య ఘట్టాలతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాను ప్రత్యేక స్ధాయిలో నిలబెడుతుంది. నా అభిమాన సంగిత దర్శకుడు రహమాన్ ఇప్పటికే కథను అనుసరించి ట్యూన్స్ రెడీ చేస్తున్నాడు.
బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు వంద కోట్లు దాటే అవకాశం ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో ఈ సినిమా ఓ ముఖ్యమైన మైలు రాయిగా మిగిలిపోవాలనేది నా ఆలోచని. 'మర్మయోగి' ప్రారంభం ఆగస్టులో గ్రాండ్ గా సంప్రదాయబద్దంగా ఉంటుంది. మీడియా వారు యే విధంగా యేమి అడగినా అప్పడు చెప్పటానికి రెడిగా ఉంటాను. అలాగే ముంబయిలో సినిమా ఓపినింగ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది.
అలాగే 'దశావతారం' డివైడ్ టాక్ గురించి అడిగినప్పుడు నవ్వుతూ.."అవును...అందరిలాగే దశావతారంలో కొన్ని పొరపాట్లు చేసాను. నేనెప్పుడూ నా తప్పుల్ని దాచి మాట్లాడటానికి ఇష్టపడను.నాకు తెలిసుండి అలాంటి మెగా ప్రాజెక్టు లో కొన్ని పొరపాట్లనేవి అత్యంత సహజం.అవి తెలుసుకుని యాక్సెప్ట్ చేయటంద్వారా రాబోయే సినిమాల్లో అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడటానకి ఆస్కారమిస్తుంది. ఈ విషయంలో నా సినిమాలో తప్పుల్ని ఎత్తి చూపి,విమర్శించిన వారికి థాంక్స్ చెప్పకుంటున్నా"ని ముగించారు.


Click it and Unblock the Notifications











