కోర్టులో కమల్, శ్రీదేవి
కమల్ హాసన్,శ్రీదేవి జంట ఒకప్పుడు భలే క్రేజ్. వారు పోస్టర్స్ మీద జంటగా కనపడితే కనకవర్షం కురిసేదని అనేక చిత్రాలు చెప్తాయి. అయితే చాలా విచిత్రంగా కాకతాళీయంగా వారిద్దరూ ఒకే సారి ఈ రోజు(గురువారం)మద్రాస్ హైకోర్టుకు అటెండు అవుతున్నారు. కమల్ హాసన్ తన లేటెస్ట్ ఫిలిం ఈనాడు నిమిత్తమైతే, శ్రీదేవి తన భర్త నిర్మించిన తాజా చిత్రం వాంటెడ్ కోసం. ఈ రెండూ ఈ శుక్రవారమే రిలీజు కానున్నాయి. అలాగే ఈ రెండూ కూడా రీమేక్ లే. కమల్ హాసన్ ఈనాడు చిత్రం బాలీవుడ్ ఎ వెడ్నస్ డే కి రీమేక్. అలాగే హిందీ వాండెట్ తెలుగు చిత్రం పోకిరీకి రీమేక్. కమల్ పై మర్మయోగి సమయంలో చేసుకున్న ఎగ్రిమెంట్ ఉల్లంఘించారంటూ పిరమిడ్ సాయిమీరా ఇంటర్నేషనల్ వారు కేస్ ఫైల్ చేసారు. ఆ కేసును రాజసూర్య అనే జడ్జి పరిశీలించి తీర్పు ఇవ్వనున్నారు. అలాగే శ్రీదేవి కూడా తన భర్త బోనీకపూర్ తమ హోమ్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన వాంటెడ్ నిమిత్తం ధాకలైన కేసు ఫైనల్ కోసం వస్తోంది. ఆమెకు మూడు కోట్లు కట్టి కాంప్రమైజ్ చేసుకోమని జడ్జి రాజసూర్య కోరుతున్నారు. ఇది ప్రక్కన పెడితే కమల్, శ్రీదేవి ఇద్దరూ ఒకే సారి కోర్టుకు అటెండు అవ్వాల్సి రావటం మాత్రం విచిత్రమై..అభిమానులకు కన్నుల పండగే.


Click it and Unblock the Notifications











