కమల్ హాసన్ పై 11కోట్ల కేసు

By Staff

Kamal Hassan
బాలీవుడ్ సూపర్ హిట్ 'ఎ వెడ్నస్ డే' చిత్రాన్ని రీమేక్ చేసి,రిలీజ్ కి రెడీ చేస్తున్న కమల్ హాసన్ పై పిరమిడ్ సాయిమిరా సంస్ధ 11 కోట్లు రూపాయలుకి సంభందిచిన కేసు వేసింది. కమల్ హాసన్ తమకు రాసిన ఎగ్రిమెంట్ ప్రకారం మాట నిలబెట్టుకోలేదని పిరమిడ్ సాయిమిరా సంస్ధ హైకోర్టు వెళ్ళింది.తమకు న్యాయం జరిగేవరకు (శుక్రవారం రిలీజ్ కానున్న) 'ఈనాడు' చిత్రం తమిళ వర్షన్ సైతం నిలిపివేయాలని పిటీషన్ ధాకలు చేసింది. సాయి పిరమడ్ వారు ధాకలు చేసిన పిటీషన్ ప్రకారం కమల్ హాసన్ స్వంత సంస్ధ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ చారిత్రాత్మక చిత్రం 'మర్మయోగి'ని తీసిపెడతానని వారికి ఎగ్రిమెంట్ రాసారు. అందునిమిత్తం వ్యక్తిగత పూచీ కత్తుపై బాలీవుడ్ నటులు అమితాబ్,హేమమాలిని,ప్రియాంకచోప్రాలను ఒప్పించి డేట్స్ తెస్తానని హామి ఇచ్చారు. అంతేకాక పిరమిడ్ సాయిమిరా వారినుండి అడ్వాన్స్ లు ఇచ్చేందుకు కాను పదికోట్ల తొంబై లక్షల రూపాయలు తీసుకోవటం జరిగింది. అయితే కమల్ హాసన్ చెప్పినట్లు చేయక వారినుంచి ఏ విధమైన డేట్స్ తీసుకురాలేదు.అంతేకాక ఆ ఎగ్రిమెంట్ లో రాసుకున్న ప్రకారం మర్మయోగి పూర్తయ్యే వరకూ వేరే చిత్రం ప్రారంభించకూడదు.అయితే ఎగ్రిమెంట్ లో రాసుకున్న ఈ నిబంధనలు ఉల్లంగించాడని కమల్ పై ఆరోపిస్తూ వారు పిటీషన్ వేసారు. ఈనాడు తమిళ వెర్షన్ రిలీజ్ కావాలంటే తక్షణమే ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు చెల్లించి సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. ఈ విషయమై కమల్ ఏం స్పందిచారో తెలియరాలేదు. జడ్జిగారు ఈ కేసును రేపటికి అంటే సెప్టెంబర్ పదహారుకు వాయదావేయటం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X