ఐటిఐ కోర్సుగా సినిమా..కమల్ కోరిక
ఇండస్ట్ర్రియల్ ట్రైనింగ్ కోర్స్లుల్లో సినిమాను కూడా ఒక ట్రేడ్ గా కలపాలని కమల్ హాసన్ ప్రతిపాదించారు.చెన్నైలో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ నేషనల్ కాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. టెక్నీషియన్స్ చాలా మంది కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యంలో వెనకపడుతున్నారు.దీనికి పరిష్కారం ఓ పద్దతి ప్రకారం ట్రైనింగ్ తీసుకోవటమేనని నేను భావిస్తున్నాను. అప్పుడే భవిష్యత్ అవసరాలని, ఛాలెంజ్ లను ఎదుర్కొనగలం. ఐటిఐ లలో ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా భవిష్యత్ ప్రణాళిక అమలు చేసినట్లవుతుంది. దీనికి ప్రభుత్వం ముందుకు వస్తే చాలా మంది సాంకేతిక నిపుణులకు ఆసరా లభిస్తుంది. మంచి సాంకేతిక నిపుణులు ఈ రంగంలోనూ లభిస్తారు. ఇక ఈ ఫంక్షన్ లో కరుణానిధిని లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. దానికి కమల్ స్పందిస్తూ..నేను ఈయన డైలాగులతోనే నటన నేర్చుకున్నారు. ఈయన కలం ఇప్పటికీ సజీవంగానే ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











