twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాంచన-3’ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. నిజం తేల్చిన పోలీసులు, అరెస్ట్!

    |

    రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'కాంచన -3' మూవీలో నలుగురు హీరోయిన్లు నటించారు. ఓవియా, వేదిక, నిక్కి తంబోలితో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హీరో లారెన్స్‌కు జోడీగా ఒక రష్యన్ భామ నటించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు రి డిజావి అలెగ్జాండ్రా.

    రి డిజావి అలెగ్జాండ్రా కొన్ని రోజులుగా చెన్నైలోనే ఉంటూ నటిగా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఈ భామ ఓ ఫోటోగ్రాఫర్ మీద కంప్లయింట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రూపేష్ కుమార్ అనే ఫోటోగ్రాఫర్ తనను సెక్స్ కోసం వేధించినట్లు ఆమె ఆరోపించారు.

    ఫోటో షూట్ కోసం పిలిచి కోరిక తీర్చమన్నాడు

    ఫోటో షూట్ కోసం పిలిచి కోరిక తీర్చమన్నాడు

    తనకు చాలా మంది సినిమా వాళ్లతో పరిచయం ఉందని, నీ ఫోటోస్ చూపించి అవకాశాలు వచ్చేలా చూస్తాను అని.... రూపేష్ కుమార్ ఫోటో షూట్ కోసం తనను పిలిపించాడని, ఫోటో షూట్ అయ్యాక తనతో పడుకోవాలని బలవంతం చేశాడని రి డిజావి అలెగ్జాండ్రా ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఫోటోలు మార్ఫింగ్ చేస్తానని బ్లాక్ మెయిల్

    ఫోటోలు మార్ఫింగ్ చేస్తానని బ్లాక్ మెయిల్

    తన కోరిక తీర్చడానికి ఒప్పుకోక పోవడంతో.... ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలెగ్జాండ్రా ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు.

    నిందితుడి అరెస్ట్, జైల్లో...

    నిందితుడి అరెస్ట్, జైల్లో...

    అలెగ్జాండ్రా చేస్తున్న ఆరోపణలు నిజమే అని తేల్చిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని చెన్నై నగరంలోని పుఢల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.

    కాంచన-3

    కాంచన-3

    అలెగ్జ్రాండ్ర నటించిన ‘కాంచన-3' గతవారం విడుదలైంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.

    English summary
    Kanchana 3 actress Ri Djavi Alexandra recently filed a complaint against a photographer named Roopesh Kumar. She alleged that, the photographer asked her to sleep with him. He blackmailed that he would morph the images and release them on the internet if she doesn't heed his demands.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X