Chandramukhi 2 చంద్రముఖిగా కంగన రనౌత్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. 18 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఆ చిత్రానికి కొనసాగింపుగా ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తన్నది. ప్రముఖ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన రనౌత్, రాఘవ లారెన్స్ నటిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.
హారర్ జోనర్‌లో రూపొందుతున్న చంద్రముఖి సినిమా డైరెక్టర్ పీ వాసుకు తన కెరీర్‌లో 25వ సినిమా. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా , తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంథోని ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమాను వినాయకచవితి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్ వెల్లడించింది.

చంద్రముఖి 2 రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాస్కరన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో చంద్రముఖి సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది. వినాయకచవితికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వైజీ మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టీఎం కార్తీక్ తదితరులు
దర్శకత్వం: పి.వాసు
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్
సినిమాటోగ్రఫీ: ఆర్డీడి.రాజశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
ఎడిటర్: ఆంథోని
స్టంట్స్: కమల్ కన్నన్, రవివర్మ, స్టంట్ శివ, ఓం ప్రకాష్,
లిరిక్స్: యుగ భారతి, మదన్ కర్కి, వివేక్, చైతన్యప్రసాద్,
కాస్ట్యూమ్స్: పెరుమాల్ సెల్వం,
కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, దొరతి,
మేకప్: శబరి గిరి
స్టిల్స్: జయరామన్
ఎఫెక్ట్స్: సేతు,
ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్, నాక్ స్టూడియోస్,
పబ్లిసిటీ డిజైన్: ముత్తు, పాయింటర్ స్టూడియో,
పీఆర్వో: యువరాజ్(తమిళ్), సురేంద్ర నాయుడు - ఫణి కందుకూరి (తెలుగు)


Click it and Unblock the Notifications











