Chandramukhi 2 ఆఫర్ కోసం అలా వెంటపడ్డా.. కంగన రనౌత్.. లారెన్స్ మాస్టర్ గురించి షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన చంద్రముఖి ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్ హిట్‌తో ఊపేయడమే కాకుండా రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చంద్రముఖి 2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబైంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ అట్టహాసంగా నిర్మించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని ఓఎంఆర్ ప్రాంతంలోని జిప్పిమేర్ ఇంజనీరింగ్ కాలేజీలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఆర్ డీ రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, సహా మహిమ, సృష్టి, సంగీత దర్శకులు కీరవాణి, గాయకులు అమల, గేయ రచయిత చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణిని లైకా అధినేత సుభాస్కరన్ సన్మానం చేశారు. ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకొన్న దర్శకుడు పీ వాసును కూడా సన్మానించారు.
చంద్రముఖి 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్ ఎమోషనల్ అయ్యారు. నేను నటిగా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ చంద్రముఖి 2 లాంటి గొప్ప సినిమా చేయలేదు. చంద్రముఖి 2 సినిమాలో ఆఫర్ గురించి నన్ను ఎవరూ అడగలేదు. నేనే డైరెక్టర్ పీ వాసు గారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అని కంగన రనౌత్ చెప్పారు.

చంద్రముఖి 2 సినిమా వచ్చే క్రెడిట్ అంతా దర్శకుడు పీ వాసుకు దక్కుతుంది. కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ నాకే కాదు.. చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేషన్. ఆయన చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, దర్శకుడిగా మారి.. ఎంతో ఎత్తుకు ఎదిగారు. లారెన్స్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు. అలాంటి గుణం చాలాతక్కువ మందికే ఉంటుంది.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు, ప్రముఖ ఫ్యాషన్ డైరెక్టర్ నీతూ లుల్లా, సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ లాంటి గొప్ప టెక్నీషియన్స్‌తో వర్క్ చేసే అవకాశం లభించింది. ఇక హాస్య నటుడు వడివేలు గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఈ సినిమాలో తనదైన స్టైల్లో అందరినీ నవ్విస్తారు. ఇంకా చాలా మంది ప్రతిభావంతులు ఈ సినిమాకు పనిచేశారు అని కంగన రనౌత్ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతా ఆయన గురించి గొప్పగా మాట్లాడింది. ఆయనకు ఆస్కార్ అవార్డ్ వస్తే నాకే వచ్చినట్లు సంతోషపడ్డాను. ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో సినిమా చేయటం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇక నిర్మాత సుభాస్కరన్ గారు ఎంతో మంచి వ్యక్తి. చాలా ప్యాషన్‌తో గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన రూపొందించిన చంద్రముఖి 2 మంచి విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











